మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీస్
ABN, Publish Date - Mar 06 , 2026 | 03:17 PM
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఓ ట్రాఫిక్ పోలీసు.. ఆపదలో ఉన్న ఓ వృద్ధుడి పట్ల స్పందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
1/5
హైదరాబాద్ JNTU యూ‑టర్న్ వద్ద KPHB ట్రాఫిక్ కానిస్టేబుల్ నాగిరెడ్డి మానవత్వం చాటుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి కన్న తండ్రికి నాలుగు మెతుకులు పెట్టలేక నడి రోడ్డు మీద విడిచి వెళ్లినట్టు గుర్తించిన నాగిరెడ్డి, వెంటనే ఆ వృద్ధుడిని రోడ్డు పక్కన సురక్షితంగా ఒక ఉంచి, అతనికి తాగునీళ్లు అందించి, ఆకలితో ఉన్న వృద్ధుడికి అన్నం పెట్టారు.
2/5
ఎండలో విధులు నిర్వర్తిస్తూ కూడా అవసరంలో ఉన్న వ్యక్తికి చేయూతనివ్వడం అందరి హృదయాలను కదిలిస్తోంది. రోడ్డు మీద నిత్యం ట్రాఫిక్‌ను నియంత్రించే బాధ్యతల మధ్య కూడా మానవత్వాన్ని చూపిన ఈ దృశ్యం ప్రశంసలు అందుకుంటోంది.
3/5
అతనికి సహాయం చేస్తూ, అతని సామాను సర్దిపెట్టి ఆదరంగా మాట్లాడుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. బాధ్యతల మధ్య కూడా అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం నిజమైన సేవా భావానికి నిదర్శనం.
4/5
సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఎండను తట్టుకునేందుకు కూరగాయల వ్యాపారులు రంగురంగుల గొడుగులను ఉపయోగిస్తున్నారు.
5/5
ఉదయం నుంచి కస్టమర్లతో బిజీగా ఉండే కూరగాయల వ్యాపారులు ఇలా మధ్యలో కాసేపు ఊపిరి పీల్చుకుంటూ తమ రోజువారీ జీవన పోరాటాన్ని కొనసాగిస్తుంటారు.
Updated at - Mar 06 , 2026 | 03:19 PM