శ్రీరామనవమికి ముస్తాబైన ఆలయాలు
ABN, Publish Date - Mar 26 , 2026 | 08:57 PM
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఆలయాలు కళకళలాడుతున్నాయి. ప్రత్యేక అలంకరణలతో దేవాలయాలు ముస్తాబై, ఉత్సవ వాతావరణం నెలకొంది.
1/5
శ్రీరామనవమిని పురస్కరించుకుని హైదరాబాద్ రామాలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఆలయాలను అందంగా అలంకరించారు.
2/5
శ్రీరామనవమి సందర్భంగా సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లోని రామాలయం విద్యుత్ దీపాలతో భక్తులను ఆకట్టుకుంటూ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
3/5
సికింద్రాబాద్‌లోని రామలింగేశ్వర దేవాలయం, తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ దేవాలయాలు విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు.
4/5
సరూర్‌నగర్ రామాలయం రంగురంగుల లైటింగ్‌తో భక్తులను ఆకట్టుకుంటోంది.
5/5
ఆలయాలకు రంగులువేసి, విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
Updated at - Mar 26 , 2026 | 08:57 PM