మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రాహుల్
ABN, Publish Date - Mar 02 , 2026 | 04:10 PM
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించారు. వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు.
1/5
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల కమిటీల (పీఏసీ) సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
2/5
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
3/5
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడానికి సమర్థవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
4/5
మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు.
5/5
మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో-అమెరికన్ ట్రేడ్ డీల్‌తో ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు.
Updated at - Mar 02 , 2026 | 04:11 PM