సికింద్రాబాద్‌లో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులతో ఆలయాలు
ABN, Publish Date - Apr 02 , 2026 | 04:24 PM
హైదరాబాద్‌లో గురువారం హనుమాన్ జయంతి వివిధ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా సికింద్రాబాద్ లోని తాడ్ బంద్, నామాలగుండు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
1/6
హనుమాన్ జయంతి సందర్భంగా.. ఆంజనేయస్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పూజారి. జయంతి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
2/6
హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు.
3/6
హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
4/6
స్వామివారి విగ్రహాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హనుమాన్ చాలీసా పఠనంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
5/6
హనుమాన్ విగ్రహం వద్ద ఒక యువకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వేషధారణలో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. భక్తితో పాటు దేశభక్తిని చాటుకున్న వ్యక్తితో భక్తులు సెల్పీలు దిగారు.
6/6
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు భక్తులు.
Updated at - Apr 02 , 2026 | 04:24 PM