'Hustle Hive' ఏఐ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు

ABN, Publish Date - Jan 07 , 2026 | 08:27 PM

విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత కోసం Hustle Hive రూపొందించిన ఆధునిక కెరీర్, ఏఐ ప్లాట్‌ఫామ్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాన్ని, మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే టి. హరీశ్ రావు ప్రారంభించారు.

'Hustle Hive' ఏఐ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు 1/6

విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువత కోసం Hustle Hive రూపొందించిన ఆధునిక కెరీర్, ఏఐ ప్లాట్‌ఫామ్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

'Hustle Hive' ఏఐ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు 2/6

ప్రపంచవ్యాప్తంగా విద్య నుంచి ఉద్యోగం వరకూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు అందించడమే లక్ష్యంగా Hustle Hive AI పనిచేయనుంది. ప్రస్తుతం అమెరికాలో ఓపీటీ కింద ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి, అలాగే H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ ఏఐ ప్లాట్‌ఫామ్ పలు సేవలను అందిస్తోంది.

'Hustle Hive' ఏఐ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు 3/6

నామమాత్రపు సబ్‌స్క్రిప్షన్‌తో నమోదు చేసుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటివరకు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన Hustle Hive, ఇకపై ఇండియా నుంచీ తన సేవలను విస్తరించనుంది.

'Hustle Hive' ఏఐ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు 4/6

ఇప్పటికే అమెరికాలో ఉన్న సుమారు 4,000 మంది భారతీయ విద్యార్థులతో ఒక బలమైన కమ్యూనిటీని విజయవంతంగా నిర్వహిస్తోంది.

'Hustle Hive' ఏఐ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు 5/6

ఈ కార్యక్రమంలో Hustle Hive సీఈవో నిత్య శేఖర్ నీలం, సీఎఫ్‌వో చంద్ర శేఖర్ నీలం, సీఎమ్‌వో గణేష్ చంద్రనాల హాజరయ్యారు. ఇండియా కార్యాలయ ప్రారంభానికి సహకరించిన మాజీ మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

'Hustle Hive' ఏఐ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు 6/6

భవిష్యత్తులో Hustle Hive AIని గ్లోబల్ స్థాయిలో విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఈవో నిత్య శేఖర్ తెలిపారు. త్వరలోనే ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, జర్మనీ, యూకే వంటి దేశాల్లో కూడా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

Updated at - Jan 07 , 2026 | 08:30 PM