హైదరాబాద్‌ JNTUలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం

ABN, Publish Date - Mar 07 , 2026 | 02:07 PM

మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జేఎన్‌టీయూలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హైదరాబాద్‌ JNTUలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం 1/6

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్‌టీయూలో 'స్టాండ్ విత్ హర్' కార్యక్రమాన్ని నిర్వహించారు.

హైదరాబాద్‌ JNTUలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం 2/6

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘స్టాండ్ విత్ హర్’ బ్రోచర్‌‌ను ఆవిష్కరించారు.

హైదరాబాద్‌ JNTUలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం 3/6

ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డితో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, సినీ నటుడు సాయి దుర్గా తేజ్ పాల్గొన్నారు.

హైదరాబాద్‌ JNTUలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం 4/6

ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు. మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌ JNTUలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం 5/6

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌ JNTUలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం 6/6

ఈ అవగాహన కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు సాయి దుర్గ తేజ్ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నారు. మహిళల భద్రతపై సమాజంలో అవగాహన పెంచడం, మహిళల పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ క్యాంపెయిన్‌ను తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం నిర్వహిస్తోంది.

Updated at - Mar 07 , 2026 | 03:00 PM