ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
ABN, Publish Date - Apr 20 , 2026 | 05:38 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేక్ కటింగ్, అన్నదానం, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
1/7
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.
2/7
కేక్ కటింగ్, అన్నదానం, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కూడా సీఎంకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
3/7
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలు, సంబరాలతో చంద్రబాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
4/7
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
5/7
ఎన్టీఆర్ భవన్ ముందు భారీ కటౌట్ ఏర్పాటు చేసి.. పూల వర్షం కురిపించారు.
6/7
టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా రావడంతో ఎన్టీఆర్ భవన్ లో పండగ వాతావరణం నెలకొంది.
7/7
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా రూపుదిద్దిన శ్రమజీవి చంద్రబాబు నాయుడు అని పలువురు నేతలు కొనియాడారు.
Updated at - Apr 20 , 2026 | 05:38 PM