భూపాలపల్లి జిల్లాలో బతుకమ్మ సందడి.. పూల కొనుగోలులో మహిళలు బిజీ
ABN, Publish Date - Oct 09 , 2026 | 06:45 PM
తెలంగాణ రాష్ట్ర పూల పండుగ బతుకమ్మకు వేళ కావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో పండుగ సందడి నెలకొంది. రేపటి(శనివారం) నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళలు బతుకమ్మను అందంగా అలంకరించేందుకు అవసరమైన పూల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు.
1/6

2/6
ముఖ్యంగా తంగేడు, గునుగు పూలు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు.
3/6
ఈ పండుగలో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలంతా ఒకచోట చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్‌లో పూల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
4/6
బతుకమ్మ పండుగకు తంగేడు, గునుగు పూలు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఈ పూలతో బతుకమ్మను అందంగా పేర్చి పూజలు చేస్తారు.
5/6
ఈ పండుగకు అవసరమైన పూలను ముందుగానే కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్‌కు తరలివస్తున్నారు. దీంతో అంబేడ్కర్ సెంటర్ పరిసరాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
6/6
తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఆనందంగా బతుకమ్మ పండుగను చేసుకుంటారు. సంప్రదాయ పద్ధతుల్లో బతుకమ్మను అలంకరించి, కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఘనంగా చేసుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు.
Updated at - Oct 09 , 2026 | 06:58 PM