ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు.. పోటెత్తిన మహిళలు
ABN, Publish Date - Jan 04 , 2026 | 09:16 PM
‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాలు వేదికలయ్యాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు భారీగా ఈ ముగ్గుల పోటీలకు తరలి వచ్చారు. దాంతో రంగురంగుల రంగవల్లులతో భూమి తల్లి ముస్తాబు అయింది.
1/16
‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాలు వేదికలయ్యాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు భారీగా ఈ ముగ్గుల పోటీలకు తరలి వచ్చారు. దాంతో రంగురంగుల రంగవల్లులతో భూమి తల్లి ముస్తాబు అయింది. భారీ ముగ్గులు వేసి.. వాటిని రంగులో అలంకరించారు. వాటిపై రంగురంగుల పువ్వుల రేకులను చల్లారు.
2/16
ఈ పోటీలను వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువత పట్టణాలకు, నగరాలకు తరలి వచ్చింది.
3/16
ఉదయం 10.00 గంటకు ప్రారంభమైన ఈ పోటీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి.
4/16
ప్రతి ఏటా ఆంధ్రజ్యోతి ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతున్న విషయం విదితమే. ఈ రంగవల్లుల పోటీల్లో విజేతులుగా నిలిచిన వారికి జిల్లా, పట్టణ, నగరాల్లోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేస్తున్నారు.
5/16
ఈ ముగ్గుల పోటీల వల్ల మహిళల్లో జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా.. పలు సంక్లిష్ట సమయాల్లో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా ఛేదించవచ్చో.. ఈ చుక్కల ముగ్గులను కలపడం ద్వారా సాధ్యమవుతుందని పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే.
6/16
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కేంద్రాలు.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు అటు రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప వరకు ఈ రంగు రంగుల రంగవల్లులతో ముస్తాబయ్యాయి.
7/16
ఇక తెలంగాణలోని హైదరాబాద్, మెదక్, భువనగిరి, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ తదితర నగరాల్లో సైతం మున్సిపల్ స్టేడియంలు, పార్కులు ముత్యాలముగ్గులతో కొత్త శోభను సంతరించుకున్నాయి.
8/16
ముగ్గుల పోటీల్లో ఆకట్టుకున్న భారీ ముగ్గు.
9/16
ముగ్గులో పోట్టీల్లో పాల్గొన్న బాలిక
10/16
సంక్రాంతి వేళ.. ఇంటి ముందుకువ వచ్చిన హరిదాసుడు. మరోవైపు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళ
11/16
ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని.. విజేతగా నిలిచి.. అదికారుల నుంచి బహుమతి అందుకుంటున్న యువతి
12/16
ఈ పోటీల్లో వేసిన ముగ్గులను పరిశీలిస్తున్న అధికారులు
13/16
ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు
14/16
ఈ పోటీల్లో ముగ్గులను పరిశీలిస్తున్న అధికారులు
15/16
కూకట్‌పల్లిలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న శ్యామల
16/16
ముగ్గుల పోటీల్లో పాల్గొన్న కూకట్‌పల్లికి చెందిన సుప్రియా
Updated at - Jan 05 , 2026 | 03:53 PM