సేవా తీర్థ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Feb 14 , 2026 | 06:57 AM

ప్రధానమంత్రి నూతన కార్యాలయ భవనం సేవా తీర్థ్‌ను నిన్న (శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున ప్రధాని ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు పీఎం-రాహత్ పేరిట ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.

సేవా తీర్థ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 1/6

ప్రధానమంత్రి నూతన కార్యాలయ భవనం సేవా తీర్థ్‌ను నిన్న(శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

సేవా తీర్థ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 2/6

ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున పీఎం రాహత్‌, లఖ్‌పతి దీదీలు, రైతులు, స్టార్టప్‌లకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడం ద్వారా ప్రధాని మోదీ కొత్త కార్యాలయం నుంచి పాలనను ప్రారంభించారు.

సేవా తీర్థ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 3/6

దేశ రాజధాని చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 95 ఏళ్లపాటు ఒకే భవనంలో కొనసాగిన ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తొలిసారి కొత్త చిరునామాకి వేదికగా నిలిచింది.

సేవా తీర్థ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 4/6

కొత్త భవనం ‘సేవాతీర్థ్‌’లోకి శుక్రవారం లాంఛనంగా మారింది. ఆధునిక రాజధాని నగరంగా న్యూఢిల్లీ ఏర్పడిన రోజే ఈ అపూర్వ ఘటన చోటుచేసుకోవడం విశేషం.

సేవా తీర్థ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 5/6

పాలనా అవసరాల కోసం అప్పుడు నిర్మించిన సౌత్‌ బ్లాక్‌, నార్త్‌ బ్లాక్‌ల్లోనే పీఎంవో, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు పనిచేయడం మొదలుపెట్టాయి. 1947లో దేశ స్వాతంత్య్రం సిద్ధించింది.

సేవా తీర్థ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 6/6

ఇప్పటివరకు ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌ నుంచి పీఎంవో విధులు నిర్వహించింది. 95 ఏళ్ల క్రితం, 1931 ఫిబ్రవరి 13వ తేదీన న్యూఢిల్లీ నగరం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.

Updated at - Feb 14 , 2026 | 07:28 AM