అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ..

ABN, Publish Date - Jan 13 , 2026 | 07:58 AM

అహ్మదాబాద్ నగరంలోని సబర్మతి నదీ తీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ పాల్గొన్నారు. ఈ ఉత్సవం సందర్భంగా అహ్మదాబాద్ నగరం సందడిగా మారింది. పలు రంగులతో కూడిన పతంగులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ గాల్లోకి ఎగురవేశారు..

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 1/14

అహ్మదాబాద్ నగరంలోని సబర్మతి నదీ తీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 2/14

ఈ ఉత్సవంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటూ జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ పాల్గొన్నారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 3/14

ఈ సందర్భంగా అహ్మదాబాద్ నగరం పండుగ వాతావరణంతో సందడిగా మారింది.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 4/14

పలు రంగులతో అలంకరించిన పతంగులను ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కలిసి ఆకాశంలోకి ఎగురవేశారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 5/14

ముఖ్యంగా హనుమాన్ పతంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 6/14

అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ను అహ్మదాబాద్‌కు తీసుకెళ్లడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 7/14

ఛాన్స్‌లర్ స్వయంగా గాలిపటం ఎగురవేయడంలో పాల్గొనడం ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చిందని పేర్కొన్నారు..

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 8/14

సబర్మతి నదీ తీరం నుంచి అంతర్జాతీయ పతంగుల ఉత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ, జర్మనీ ఛాన్సలర్‌తో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మధురమైన అనుభూతిగా అభివర్ణించారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 9/14

సంప్రదాయం, సంస్కృతి, స్నేహబంధాలు ఒకే వేదికపై కలిసిన అరుదైన సందర్భమిదని ప్రధాని మోదీ అన్నారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 10/14

ఈ ఉత్సవం భారత్–జర్మనీ దేశాల మధ్య సాంస్కృతిక స్నేహబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రతీకగా నిలిచిందని వెల్లడించారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 11/14

ఈ ఫెస్టివల్‌‌కు సుమారు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 12/14

ఈ కార్యక్రమం కేవలం గుజరాత్ పండుగగా కాకుండా ప్రపంచ పండుగగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 13/14

రంగురంగుల గాలిపటాలతో అహ్మదాబాద్ ఆకాశం ఒక 'గ్లోబల్ విలేజ్'లా కనిపించిందని వెల్లడించారు.

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 14/14

జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ స్వయంగా గాలిపటం ఎగురవేయడానికి ప్రయత్నించడం భారత్ పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.

Updated at - Jan 13 , 2026 | 08:21 AM