బడ్జెట్ టైమ్‌లో నిర్మలా సీతారామన్ ధరించిన గత చీరలు ఇవే
ABN, Publish Date - Jan 31 , 2026 | 03:50 PM
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు(ఆదివారం) బడ్జెట్ 2026-2007 ప్రవేశపెట్టనున్నారు. కాగా, బడ్జెట్ టైమ్‌లో ఆమె ధరించిన గత చీరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1/7
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు(ఆదివారం) బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రస్తుతం బడ్జెట్‌పై ఎంత ఆసక్తి నెలకొందో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ధరించనున్న చీరపైనా అంతే ఆసక్తి నెలకొంది. గతేడాది(2025) ఆమె బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చేనేత చీర ను ఆమె ధరించారు. ఈ చీరలో బిహార్ రాష్ట్రం మధుబని కళకు చెందిన చిత్రాలు కనిపిస్తున్నాయి.
2/7
2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా చేనేత చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. ఆ ఏడాది తెలుపు రంగు, గోల్డ్ మోటిఫ్స్‌తో ఉన్న మెజెంటా బోర్డర్ సిల్క్ శారీలో కేంద్రమంత్రి కనిపించారు. 2024 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా బ్లూ కలర్ చేనేత చీరలో ఆమె దర్శనం ఇచ్చారు.
3/7
2023 బడ్జెట్ సమయంలో ఎరుపు రంగు టెంపుల్ అంచుతో ఉన్న చీరను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధరించారు.
4/7
2022 బడ్జెట్ సందర్భంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన మెరూన్ కలర్ చేనేత చీరను నిర్మల ధరించారు.
5/7
2021లో రెడ్, బ్రౌన్ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు.
6/7
2020 బడ్జెట్ సందర్భంగా ఆస్పిరేషన్ ఇండియా ఇతివృత్తంతో రూపొందించిన నీలం రంగు అంచు గల పసుపు పచ్చ- బంగారు వర్ణం చీరను ఆమె కట్టుకున్నారు.
7/7
2019లో తన తొలి బడ్జెట్ నాడు మంగళగిరి గులాబీ రంగు చీరను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధరించారు.
Updated at - Jan 31 , 2026 | 03:55 PM