యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ..

ABN, Publish Date - Jun 21 , 2026 | 11:05 AM

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 1/6

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో యోగా దినోత్సవం-2026 ప్రారంభమైంది.

యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2/6

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 3/6

దేశం, ప్రపంచం మెుత్తాన్ని యోగా అనుసంధానించిందని ప్రధాని మోదీ అన్నారు. యోగా ప్రతి ఒక్కరినీ కలుపుతుందని, ఏకం చేస్తుందని పేర్కొన్నారు.

యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 4/6

యోగాను స్వామి వివేకానంద యావత్ ప్రపంచానికి పరిచయం చేశారని, లహరి మహాశయుల వంటి యోగులు ఈ సంప్రదాయాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని మోదీ ప్రశంసించారు.

యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 5/6

వయస్సు, మానవ సామర్థ్యాన్ని తగ్గించకుండా ఉండేందుకు యోగా తోడ్పడుతుందని, మానవ జీవితం నిరంతర అభివృద్ధి కోసం ఇది సహాయపడుతుందన్నారు.

యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 6/6

20 ఏళ్ల వయస్సులో కంటే 40 ఏళ్ల వయస్సులో మరింత ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఈ మేరకు అందరూ ప్రతి రోజు యోగా సాధన చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

Updated at - Jun 21 , 2026 | 11:10 AM