సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం..
ABN, Publish Date - May 21 , 2026 | 02:17 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
1/8
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
2/8
గురువారం తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి.. ఈ పుష్కరాలను ప్రారంభించారు.
3/8
మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు నదిలో పుణ్య స్నానం ఆచరించారు.
4/8
ఈ పుష్కరాల్లో పాల్గొనేందుకు భారీగా తరలి వస్తున్న భక్తులు.
5/8
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
6/8
మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు జరుగుతాయి.
7/8
ఈ పుష్కరాల కోసం రూ. 200 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
8/8
2025, మే 15వ తేదీన సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవి మే 26వ తేదీతో ముగిశాయి. వీటిని ఆది పుష్కరాలు అని అంటారు.
Updated at - May 21 , 2026 | 02:20 PM