21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం

ABN, Publish Date - May 19 , 2026 | 10:19 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు జరగనున్నాయి. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు జరుగుతాయి.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 1/11

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 2/11

మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు జరుగుతాయి.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 3/11

ఈ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ అంత్య పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 4/11

కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో కొలువుదీరిన గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమం వద్ద భక్తులు ఈ పుణ్య స్నానాలు ఆచరిస్తారు.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 5/11

గురుడు మిథున రాశిలో ప్రవేశించడంతో ఈ సరస్వతి పుష్కరాలు వస్తాయి.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 6/11

2025, మే 15 నుంచి మే 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరిగాయి. వీటిని ఆది పుష్కరాలు అని అంటారు.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 7/11

చివరి 12 రోజులు అంత్య పుష్కరాలని పిలుస్తారు. వీటితో సరస్వతి నది పుష్కరాలు ముగుస్తాయి.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 8/11

ఈ అంత్య పుష్కరాల సమయంలో ప్రతిరోజూ వివిధ హోమాలు జరుగుతాయి.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 9/11

మే 22న సుబ్రహ్మణ్య షడక్షరి హోమం, హయగ్రీవ హోమం, మే 25న మహా మృత్యుంజయ హోమం, జూన్ 1న లఘు చండీ మహా పూర్ణాహుతితో ఈ అంత్య పుష్కరాలు ముగుస్తాయి.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 10/11

ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం 11/11

నేటి నుంచి మే 26వ తేదీ వరకు ఈ అంత్య పుష్కరాలు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

Updated at - May 19 , 2026 | 10:34 AM