మేడారంలో కీలకఘట్టం ఆవిష్కృతం..
ABN, Publish Date - Jan 30 , 2026 | 08:48 AM
ఆదివాసీ జాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. రెండేళ్లలో నిరీక్షణ తర్వాత మేడారం చేరిన వనదేవతకు భక్తకోటి ప్రణమిల్లింది. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఆదివాసీ వడ్డెలు సమ్మక్కను గద్దెలపైకి రాత్రి 9.45 గంటలకు ఆదివాసీ పూజారులు తీసుకొచ్చారు.
1/7

2/7
అంతకుముందు పూజారుల కుటుంబాలకు చెందిన మహిళలు వచ్చి సమ్మక్క గద్దెను అలంకరించి వెళ్లారు. మేడారం పడమర దిక్కులోని జెండా గుట్ట నుంచి పచ్చి వెదురుకర్ర రూపంలో ఉండే వనదేవతను తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు.
3/7
సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాన పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, మునీందర్, వడ్డెలు కొక్కెర కృష్ణయ్య బృందం చిలకల గుట్టపైకి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని అలంకరించి వారికి సంప్రదాయ పూజలు కొనసాగించారు.
4/7
అనంతరం అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణెను తీసుకొని రాత్రి 10 గంటలకు గద్దెపై కొలువుదీర్చారు. ఆ తర్వాత భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని ముక్కులు చెల్లించుకున్నారు.
5/7
అమ్మవారిని తీసుకొస్తుండగా చిలకలగుట్ట నుంచి గద్దెల ప్రాంగణం వరకు దారికి ఇరువైపులా భక్తులు పెద్ద సంక్యలో చేరుకుని.. తల్లీ సమ్మక్క.. సల్లంగ చూడమ్మ అంటూ జయజయధ్వానాలు చేశారు.
6/7
మహిళలు భారీ సంఖ్యలో చేరుకుని.. అందమైన ముగ్గులు వేసి అమ్మ వారికి స్వాగతం పలికారు.
7/7
వందలాది మంది భక్తులు డోలు, డప్పు చప్పుళ్లకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. కళాకారులు ఆదివాసీ సంప్రదాయ కొమ్ముబూర సంగీతంతో అందరిలో ఉత్సాహాన్ని నింపారు.
Updated at - Jan 30 , 2026 | 08:49 AM