కార్తీకమాసం తొలి సోమవారం.. ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల సందడి

ABN, Publish Date - Nov 16 , 2026 | 09:48 AM

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులతో పరమశివుని క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలో సోమవారం మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈరోజు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను నిర్వహించారు. ఇక నల్గొండ జిల్లాలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఛాయా సోమేశ్వరాలయం భక్తుల రద్దీ నెలకొంది.

కార్తీకమాసం తొలి సోమవారం.. ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల సందడి 1/5

కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు తరలివస్తున్నారు. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులతో పరమశివుని క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి.

కార్తీకమాసం తొలి సోమవారం.. ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల సందడి 2/5

కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్ఠత ఉంది. ఈరోజు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను నిర్వహించారు.

కార్తీకమాసం తొలి సోమవారం.. ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల సందడి 3/5

మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడు భక్తులు ఉపవాసాలు, శివాభిషేకాలు నిర్వహిస్తారు.

కార్తీకమాసం తొలి సోమవారం.. ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల సందడి 4/5

నల్గొండ జిల్లాలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

కార్తీకమాసం తొలి సోమవారం.. ఛాయా సోమేశ్వరాలయంలో భక్తుల సందడి 5/5

తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి చేరుకుని పరమశివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. శివనామస్మరణతో ఛాయా సోమేశ్వరాలయం మార్మోగుతోంది.

Updated at - Nov 16 , 2026 | 09:48 AM