ఏపీ వ్యాప్తంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు
ABN, Publish Date - Apr 08 , 2026 | 01:21 PM
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
1/7
‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
2/7
విజయవాడలోని ముస్తాబాద్ రోడ్‌లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నాయకుల ధర్నాను అడ్డుకున్నారు.
3/7
ఒంగోలులో సైతం వైసీపీ నేతలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఆందోళన ముసుగులో దాడులకు యత్నించి మీడియా సంస్థలను భయపెట్టాలని వైసీపీ కుట్ర పన్నుతోంది.
4/7
కడపలోని ఆంధ్రజ్యోతి ప్రాంతీయ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. పరిస్థితులను నియంత్రించడానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
5/7
గుంటూరులోని ఆంధ్రజ్యోతి యూనిట్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకుల ఆందోళన నేపథ్యంలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
6/7
చిత్తూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించకుండా ఉండేందుకు అధికారులు అలర్ట్ అయ్యారు.
7/7
ఇదిలా ఉంటే, శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల నియోజకవర్గంలోని మహిళలు ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు చేరుకుని సంగీభావం తెలియజేస్తున్నారు. ‘మావిగన్’ ఊబి నుంచి బయటపడేందుకు వైసీపీ ఈ కుయుక్తులకు పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు.
Updated at - Apr 08 , 2026 | 01:31 PM