గుంటూరులో వీవీఐటీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు

ABN, Publish Date - Jun 28 , 2026 | 08:57 AM

గుంటూరు జిల్లా నంబూరు వద్ద ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గుంటూరులో వీవీఐటీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు 1/4

గుంటూరు జిల్లా నంబూరు వద్ద ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ (VVITU) స్నాతకోత్సవంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గుంటూరులో వీవీఐటీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు 2/4

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. సరికొత్త సాంకేతిక యుగంలో 'వైబ్ కోడింగ్', 'ఏజెంటిక్ ఏఐ' వంటి ఆవిష్కరణలను సామాజిక ప్రయోజనాల కోసం యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

గుంటూరులో వీవీఐటీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు 3/4

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా, భారత్ 7.6శాతం వృద్ధి రేటుతో అగ్రగామిగా దూసుకుపోతోందని వివరించారు. యువత కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారుగా కాకుండా, ఉద్యోగ సృష్టికర్తలుగా మారి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.

గుంటూరులో వీవీఐటీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు 4/4

ఏ స్థాయికి ఎదిగినా మాతృభూమిని, మాతృభాషను, మూలాలను మరువకూడదని పేర్కొన్నారు. యువతరం కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉంచి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Updated at - Jun 28 , 2026 | 08:58 AM