తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ..

ABN, Publish Date - Oct 26 , 2026 | 10:01 PM

తిరుమలలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించిన పౌర్ణమి గరుడసేవలో భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ.. 1/5

తిరుమలలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించిన పౌర్ణమి గరుడసేవలో భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ.. 2/5

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ.. 3/5

అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ.. 4/5

ఈ వాహన సేవలో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సి వి ఎస్ ఓ శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ.. 5/5

పౌర్ణమి గరుడ సేవలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, పలువురు బోర్డు సభ్యులు, ఇతర ఆలయ అధికారులు కూడా ఉన్నారు.

Updated at - Oct 26 , 2026 | 10:05 PM