ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
ABN, Publish Date - Apr 23 , 2026 | 05:40 PM
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నాకు దిగారు. ఈ ఆందోళన కారణంగా బస్సు సర్వీసులు ప్రభావితమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
1/5
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
2/5
ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నాకు దిగారు.
3/5
ఇక ఈ ధర్నా కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులు సరిగా నడవకపోవడంతో ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో ప్రత్యామ్నాయంగా సేవలు కొనసాగుతున్నాయి.
4/5
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపారు. సమస్యలపై పరిష్కారం దిశగా చర్చలు జరిపారు.
5/5
ప్రభుత్వం చర్చల పేరుతో తమను తప్పుదారి పట్టిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated at - Apr 23 , 2026 | 05:41 PM