భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Aug 01 , 2026 | 01:23 PM
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాశ్రయ టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్‌ను ప్రధాని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
1/6
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.
2/6
ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ గిరిజన విద్యార్థినిలు, మహిళలు చేసిన థింసా నృత్యాన్ని మోదీ తిలకించారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఉన్నారు.
3/6
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
4/6
భోగాపురం ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబుకు నవ్వుతూ కరచాలనం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమానాశ్రయం ముందు ఫొటో దిగిన సీఎం.
5/6
ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబుతో ఫొటో దిగిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్, పల్లా శ్రీనివాసరావు, పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీ భరత్.
6/6
ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమస్కారం చేస్తున్న మంత్రి నారా లోకేశ్.
Updated at - Aug 01 , 2026 | 01:41 PM