అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
ABN, Publish Date - Mar 14 , 2026 | 07:33 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన‘మాటా – మంతి’ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
1/10
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన‘మాటా – మంతి’ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
2/10
ఈ ‘మాటా-మంతి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
3/10
నందిగరువు గ్రామానికి దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి రోడ్డు వేయించామని పవన్ అన్నారు. గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీలు పడుతున్న ఇబ్బందులు చూడలేక కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
4/10
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జలజీవన్ మిషన్ పథకంలో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేశారని పవన్ అన్నారు.
5/10
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిజన గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని తెలిపారు.
6/10
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లక్షలాది మంది మధ్య జరుపుకోవచ్చని.. కానీ అరణ్యం మధ్యలో 40 ఇళ్లు మాత్రమే ఉన్న మారుమూల గిరిజన గ్రామంలో జరుపుకోవాలని ఇక్కడికి వచ్చానని పవన్ అన్నారు.
7/10
ఈ ప్రాంతంలో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలవకపోయినా, తాము ఎక్కడా వివక్ష చూపించలేదని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.
8/10
ఇక్కడి ప్రజలు, యువత అండగా నిలబడితే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని తెలిపారు.
9/10
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గ్రామ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధికారులతో చర్చించి ఆయన వెంటనే పరిష్కరించారు.
10/10
తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి జల్ జీవన్ మిషన్ పథకం నిధులతో సమస్యను పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Updated at - Mar 14 , 2026 | 07:33 PM