శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - Nov 21 , 2026 | 11:28 AM
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. నూతన జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని దివంగత నేత పరిటాల రవీంద్ర వారసుడు, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అధిరోహించడంతో జిల్లాలో సరికొత్త పరిటాల శకం ప్రారంభమైంది. కూటమి పొత్తు ధర్మానికి అనుగుణంగా జనసేన పార్టీకి చెందిన గోరంట్ల జడ్పీటీసీ సునేత్ర వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
1/9
శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ పీఠంపై పరిటాల శకం మొదలైంది. జిల్లా ప్రజా పరిషత్ ప్రథమ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా నాయకుల సమక్షంలో, అభిమానుల ఆశీస్సులతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం జరిగింది.
2/9
పుట్టపర్తిలోని జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకున్న శ్రీరామ్.. జిల్లా ఎన్నికల పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, కూటమి జడ్పీటీసీ సభ్యులతో సమావేశమై.. అనంతరం నేతలందరూ కలిసి మామిళ్లకుంట క్రాస్‌లోని రెవెన్యూ భవన్‌కు చేరుకున్నారు.
3/9
జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నల్లచెరువు జడ్పీటీసీ సభ్యునిగా, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా ప్రథమ జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు.
4/9
తండ్రి రవి ఆశయాలు, తల్లి సునీతమ్మ స్ఫూర్తితో పని చేస్తానని, జిల్లాను అభివృద్ధి పథంలో నిడిపిస్తానని పరిటాల శ్రీరామ్ అన్నారు. పార్టీ నాపై పెట్టిన బాధ్యతను, పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని శ్రీరామ్ తెలిపారు.
5/9
నాడు పరిటాల రవి.. బి.కె.పార్థసారథిని, నేను చమన్‌ను జడ్పీ ఛైర్మన్లుగా చేశామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గుర్తుచేశారు. ఏ జడ్పీ చైర్మన్ పదవి కోసం అయితే పరిటాల రవి ప్రాణాలు పోగొట్టుకున్నారో, నేడు జిల్లా నేతలందరి సహకారంతో అదే ఛైర్మన్ పీఠంపై మా కుమారుడు శ్రీరామ్ కూర్చోవడం ఒక అదృష్టంగా, దైవ నిర్ణయంగా భావిస్తున్నానన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సునీత చెప్పారు.
6/9
కూటమి ధర్మాన్ని పాటిస్తూ టీడీపీకి ఛైర్మన్, జనసేనకు వైస్ ఛైర్మన్ పదవులు కేటాయించామని మంత్రి సవిత అన్నారు. భివృద్ధే మా వజ్రాయుధం అని.. పరిటాల వారసుడిగా శ్రీరామ్ సారథ్యంలో జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు.
7/9
కూటమి పొత్తు ధర్మానికి అనుగుణంగా జనసేన పార్టీకి చెందిన గోరంట్ల జడ్పీటీసీ సునేత్ర వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
8/9
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం ధర్మవరం పట్టణానికి చేరుకున్న పరిటాల శ్రీరామ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ఎర్రగుంట సర్కిల్ వద్దకు భారీగా తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ శ్రీరామ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
9/9
అనంతరం ఎర్రగుంట సర్కిల్ నుంచి కదిరి గేట్ వరకు నిర్వహించిన భారీ విజయోత్సవ ర్యాలీతో ధర్మవరం పట్టణం పసుపుమయమైంది. ధర్మవరం పట్టణం మొత్తం పరిటాల నినాదంతో దద్దరిల్లింది.
Updated at - Nov 21 , 2026 | 11:28 AM