స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన నారా లోకేష్
ABN, Publish Date - Jun 09 , 2026 | 01:56 PM
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన మంత్రి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
1/5
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు.
2/5
ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన, మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
3/5
అనంతరం బాధితుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన మంత్రి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
4/5
మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
5/5
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆర్.మల్లికార్జునరావు, గుడివాడ అర్జున అప్పారావు, బి.సత్యానంద గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
Updated at - Jun 09 , 2026 | 01:59 PM