టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్

ABN, Publish Date - Jan 31 , 2026 | 10:16 AM

ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు చేసిన వారికి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అధునాతన నైపుణ్యాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కుప్పాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పని చేయాలని కోరారు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 1/12

రాష్ట్రంలో తొలి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్.. కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కుంగుంది బౌల్డరింగ్ పార్క్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 2/12

కుప్పం మున్సిపాల్టీ పరిధిలో నవదిశ కేంద్రంలో ఏర్పాటు చేసిన హిందాల్కో-ఆదిత్య బిర్లా గ్రూప్-కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథార్టీ భాగస్వామ్యంతో మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటు చేశారు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 3/12

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ పని చేయనుంది. మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ ద్వారా 2500 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 4/12

సుమారు 20 వేల మంది యువతకు నైపుణ్యం, సాధికారత లభించేలా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పని చేయనుంది. సీఎం చొరవతో సంబల్ పూర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తరహాలోనే కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 5/12

కుప్పంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ గేట్ వేగా నవదిశ కేంద్రం వ్యవహరించనుంది. ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వచ్చే మూడేళ్ల్లల్లో 1000 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నారు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 6/12

అలాగే 700 మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూర్టీ, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఫ్యాషన్ టెక్నిషీయన్, ఐటీ ల్యాబ్ తదితర కోర్సుల్లో ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 7/12

నవదిశ కేంద్రంలోని సేవలు అందించే వారితో సీఎం మాటామంతీ.. ఆఫీస్ స్పేస్ లేని వారికి బాసటగా కో-వర్కింగ్ స్పేస్.. హైస్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, ప్యాంట్రీ, స్టోరేజ్ వసతులతో 50 మంది పని చేసుకునేలా కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను రూపొందించారు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 8/12

ఇదే కాకుండా అదనంగా 40 మంది చదువుకునేలా లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ సహకారంతో రూ.1 కోటి వ్యయంతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 9/12

మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కో-వర్క్ స్పేస్ సెంటర్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 10/12

ఓవైపు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు... ఆఫీస్ స్పేస్ లేని వారికి.. వర్క్ ఫ్రం హోం చేసుకునే వారికి బాసటగా కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ప్రారంభించామని సీఎం తెలిపారు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 11/12

రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా సెంటర్ కుప్పంలో ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

టూరిజానికి ట్రై జంక్షన్ కుప్పం.. అధునాతన నైపుణ్యాల శిక్షణా కేంద్రంగా నవదిశ సెంటర్ 12/12

అంతకు ముందు కుప్పం రూరల్ మండలంలో వివిధ పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కుప్పం మండలంలోని కంగుంది హెరిటెజ్ విలేజ్-బౌల్టరింగ్ పార్కును ప్రారంభించారు.

Updated at - Jan 31 , 2026 | 11:36 AM