కొవ్వూరు గోపాద క్షేత్రంలో ప్రకృతి అందాల విందు
ABN, Publish Date - Mar 06 , 2026 | 02:03 PM
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోపాద క్షేత్రం ప్రకృతి సోయగాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలో సాయంత్రం వేళలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి.
1/5
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోపాద క్షేత్రం ప్రకృతి సోయగాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలో సాయంత్రం వేళలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి.
2/5
ప్రతి రోజు సూర్యాస్తమయం సమయానికి పలుచోట్ల నుంచి గుంపులుగా పక్షులు వచ్చి ఆలయ శిఖరాలు, చెట్లపై వాలుతూ ఆకాశంలో అందమైన విన్యాసాలు చేస్తున్నాయి.
3/5
పక్షులు గాలిలో తిరుగుతూ చేసే ఈ విన్యాసాలు చూసేందుకు అక్కడికి వచ్చే భక్తులు, ప్రకృతి ప్రేమికులు మంత్రముగ్ధులవుతున్నారు.
4/5
చెట్లపై వాలిన పక్షుల కిలకిలారావాలతో పాటు పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నది గలగల ధ్వనులు కలిసి ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తున్నాయి.
5/5
ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు సాయంత్రం సమయంలో చాలా మంది అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో గోపాద క్షేత్రం ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేక ప్రదేశంగా మారింది.
Updated at - Mar 06 , 2026 | 02:05 PM