బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరామర్శ
ABN, Publish Date - Feb 28 , 2026 | 08:47 PM
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది దుర్మరణం చెందారు.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
1/5
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పేలుడు ఘటన తీరును అధికారులు సీఎంకి వివరించారు.
2/5
ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అక్కడ పనిచేస్తున్న కార్మికుల మృతదేహాలు తునాతునకలై గాల్లోకి ఎగిరి, పక్కనే ఉన్న పొలాల్లో పడ్డాయి.
3/5
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
4/5
పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు.
5/5
బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Updated at - Feb 28 , 2026 | 08:59 PM