ఆకలి ఆరాటం.. అన్నం కోసం ఉడతలు, పావురం పోటీ
ABN, Publish Date - Aug 22 , 2026 | 11:25 AM
ఆకలి తీర్చుకునేందుకు చిన్న జీవులు పడే ఆరాటానికి ఈ దృశ్యం అద్దం పట్టింది. కడప నగరంలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద కొద్దిసేపు జరిగిన ఈ ఆసక్తికర దృశ్యాలు అక్కడున్నవారిని ఆకట్టుకున్నాయి.
1/6
మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా ఆకలి బాధ అందరికీ ఒకటే. సమయానికి ఆహారం దొరికితేనే ఆకలి తీరుతుంది.
2/6
మనుషులు తమకు కావాల్సిన ఆహారాన్ని ఎలాగోలా సమకూర్చుకోగలుగుతారు. కానీ పక్షులు, చిన్న జంతువులు మాత్రం ఆహారం కోసం రోజంతా వెతకాల్సి ఉంటుంది.
3/6
ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనిపిస్తే చాలు.. తమ ఆకలి తీర్చుకునేందుకు వెంటనే అక్కడికి చేరుకుంటాయి. ఈ క్రమంలోనే కడప నగరంలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఆకలి కోసం చిన్న జీవుల మధ్య జరిగిన పోటీ అందరి దృష్టిని ఆకర్షించింది.
4/6
కార్యాలయ సిబ్బంది భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నాన్ని అక్కడి గోడపై వేయగా.. రెండు ఉడతలు అక్కడికి చేరుకున్నాయి. ఆకలి తీర్చుకునేందుకు అవి అన్నం తినడం ప్రారంభించాయి.
5/6
ఇంతలో ఓ పావురం అక్కడికి చేరుకుని ఉడతలను తరిమేసి అన్నాన్ని తినేందుకు ప్రయత్నించింది. అయితే ఆహారం కోసం ఓ ఉడత ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పావురంతో పోటీ పడుతూ అన్నం తినేందుకు ప్రయత్నించింది.
6/6
పావురం కూడా వెనక్కి తగ్గకుండా ఉడతను తరిమేసి అన్నం తినేందుకు ప్రయత్నించింది. కాసేపు సాగిన ఈ ఆసక్తికర పోటీ అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
Updated at - Aug 22 , 2026 | 11:33 AM