మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 01 , 2026 | 07:35 PM

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు మంగళవారం పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు పింఛన్లు పంపిణీ చేసి.. వారి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు.

మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు 1/5

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు.. పడవల వద్ద కూర్చున్న మత్స్యకారులతో ఆప్యాయంగా మాట్లాడారు. మత్స్యకారుల కుటుంబాల పరిస్థితి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు.

మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు 2/5

తిరుమని స్వామి అనే మత్స్యకారుడికి సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ సొమ్మును అందజేశారు. వారి కుటుంబ యోగక్షేమాలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందించే పథకాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు 3/5

మత్స్యకారుడి ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు వారితో కలిసి బోటులో ప్రయాణించారు. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులపై మత్స్యకారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.

మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు 4/5

వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారుల రోజువారీ జీవితం ఎలా ఉంటుందో చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వేట సమయంలో మత్స్యకారులు ఎన్ని గంటలు సముద్రంలో ఉంటారు, అక్కడ భోజనం ఎలా చేస్తారనే విషయాలను సీఎం ఆరా తీశారు.

మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు 5/5

వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.20 వేల ఆర్థిక సాయం తమకు ఎంతో ఉపయోగపడుతోందని మత్స్యకారులు సీఎంకు తెలిపారు. మొగల్తూరు పర్యటనలో మత్స్యకారులతో సీఎం చంద్రబాబు సరదాగా ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు.

Updated at - Sep 01 , 2026 | 07:35 PM