నారావారి పల్లెలో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు..
ABN, Publish Date - Jan 13 , 2026 | 08:29 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేశ్ దంపతులు, లోకేశ్ కుమారుడు దేవాన్ష్, నటరత్న, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, విశాఖ ఎంపీ శ్రీభరత్ దంపతులుతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
1/14
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.
2/14
ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేశ్ దంపతులు, లోకేశ్ కుమారుడు దేవాన్ష్, నటరత్న, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, విశాఖ ఎంపీ శ్రీభరత్ దంపతులుతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
3/14
ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలను నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పరిశీలించారు.
4/14
అలాగే గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ తదితర క్రీడల పోటీలు నిర్వహించారు.
5/14
ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి సీఎం చంద్రబాబు దంపతులు బహుమతులు అందజేశారు.
6/14
ముగ్గుల పోటీల్లో విజేతలకు సైతం బహుమతులు ఇచ్చారు.
7/14
బాలుర పోటీలను సీఎం చంద్రబాబు దంపతులు ఆసక్తిగా తిలకించారు.
8/14
ఈ సందర్భంగా చిన్నారులు, ఉపాధ్యాయులతో కలిసి ఫోటోలు దిగారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.
9/14
దాదాపు రెండు గంటల పాటు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం చంద్రబాబు సంతోషంగా గడిపారు.
10/14
అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆర్జీలను స్వీకరించారు.
11/14
ఈ సమస్యలు పరిష్కరిస్తానంటూ ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
12/14
ఈ కార్యక్రమంలో జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా నారా వారి పల్లెలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
13/14
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
14/14
ఈ సంబరాల్లో నిర్వహించిన క్రీడా పోటీలను గ్రామస్తులంతా ఆసక్తిగా తిలకించారు.
Updated at - Jan 13 , 2026 | 08:47 PM