శాలిహుండం శ్వేతగిరిపై భీష్మ ఏకాదశి వేడుకలు..
ABN, Publish Date - Jan 29 , 2026 | 08:56 PM
శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ప్రసిద్ధ శాలిహుండం శ్వేతగిరిపై భీష్మ ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు..
1/6
భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ప్రసిద్ధ శాలిహుండం శ్వేతగిరిపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
2/6
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగావళి నదిలో నిర్వహించిన చక్రతీర్థ స్నానాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
3/6
తెల్లవారుజాము నుంచే నదీ తీరం భక్తులతో కిటకిటలాడింది. సంప్రదాయబద్ధంగా స్నానాలు ఆచరించిన భక్తులు.. అనంతరం స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.
4/6
ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం, స్థానిక యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
5/6
భీష్మ ఏకాదశి సందర్భంగా శాలిహుండం క్షేత్రంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.
6/6
భద్రతా చర్యలతో పాటు తాగునీరు, వైద్య సేవలు, రవాణా సౌకర్యాలు కల్పించడంతో కార్యక్రమం ప్రశాంతంగా సాగింది.
Updated at - Jan 29 , 2026 | 09:00 PM