ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్
ABN, Publish Date - Jun 15 , 2026 | 09:12 PM
ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.
1/13
ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం నాడు సందర్శించారు.
2/13
ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.
3/13
జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని అమర స్థూపం వద్ద పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛం ఉంచి వీర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.
4/13
దేశ సార్వభౌమత్వం, భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల సేవలు చిరస్మరణీయమని కొణియాడారు.
5/13
ఈ సందర్భంగా సైనికుల త్యాగం, దేశభక్తి, సేవాస్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు కూడా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
6/13
వారి ఫలకాల వద్ద ప్రత్యేకంగా పుష్పాంజలి ఘటించి గౌరవం తెలిపారు.
7/13
దేశం కోసం ప్రాణాలను అర్పించిన ప్రతి సైనికుడు భారత జాతికి స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.
8/13
అనంతరం స్మారక చిహ్నంలోని త్యాగచక్ర గోడలపై చెక్కిన తెలుగు రాష్ట్రాలకు చెందిన అమర జవాన్ల పేర్లను పరిశీలించారు.
9/13
జాతీయ యుద్ధ స్మారక చిహ్నం భారత సైనికుల వీరగాథలను తరతరాలకు గుర్తు చేసే పవిత్ర స్థలమని పేర్కొన్నారు.
10/13
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని పవన్ కల్యాణ్ తెలిపారు.
11/13
దేశ సరిహద్దుల్లో సైనికులు పడుతున్న శ్రమ, వారు చేస్తున్న త్యాగాల వల్లే మనం ఇళ్లల్లో ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.
12/13
రాబోయే తరాలకు దేశభక్తిని, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే స్ఫూర్తిని రగిల్చే పవిత్ర క్షేత్రంగా ఈ స్మారక చిహ్నం నిలుస్తుందని పవన్ కల్యాణ్ కొనియాడారు.
13/13
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ రక్షణ కోసం జరిగిన వివిధ యుద్ధాలు, ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల పేర్లు ఇక్కడ సువర్ణాక్షరాలతో లిఖించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Updated at - Jun 15 , 2026 | 09:17 PM