చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jun 29 , 2026 | 06:36 AM
జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని ఆడించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు.
1/10
జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
2/10
అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని ఆడించారు.
3/10
పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి సీఎం తెలుసుకున్నారు.
4/10
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సీఎం సూచించారు.
5/10
పిల్లల పెంపకం భారంగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడి వారి వివరాలు అడిగారు.
6/10
ఉద్యోగానికి, ఉపాధికి వెళ్తున్న మహిళలు పిల్లల పెంపకంలో ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో భర్త, పురుషులు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు.
7/10
పిల్లల్ని కని, పెంచడం, వారి ఆలనాపాలనా చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని చెప్పారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో పెద్దవాళ్లు భాగస్వాములు అయ్యేవారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
8/10
పిల్లలను విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని సీఎం గుర్తుచేశారు.
9/10
సంతానాన్ని సమస్యగా, భారంగా చూసే విధానం పోవాలని, సంతానం అంటే సంపద అనే పరిస్థితి వస్తోందని అన్నారు. అందుకే ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.
10/10
ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి కుటుంబాలే సమాజానికి, వ్యక్తులకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Updated at - Jun 29 , 2026 | 06:40 AM