విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jun 05 , 2026 | 04:51 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు వెంట జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు ఉన్నారు.
1/5
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు.
2/5
విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సీఎం సైకిల్ సవారీ చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్‌కు ముఖ్యమంత్రి చేరుకున్నారు.
3/5
సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు వెంట జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు ఉన్నారు.
4/5
ఎర్రటి ఎండ కాస్తున్నా ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం సైకిల్ ప్రయాణం సాగింది.
5/5
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సీఎం చంద్రబాబు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
Updated at - Jun 05 , 2026 | 05:10 PM