ABN Andhra Jyothy Muggula Competition: ఒంగోలు QIS ఇంజనీరింగ్ కాలేజీలో ABN ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు
ABN, Publish Date - Jan 06 , 2026 | 09:56 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థినిలు, మహిళలు ఈ పోటీల్లో పాల్గొని అద్భుతమైన ముగ్గులతో అలరిస్తున్నారు.
1/9
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముత్యాల ముగ్గుల (రంగవల్లి) పోటీలు ఘనంగా జరుగుతున్నాయి.
2/9
ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా ప్రతి జిల్లాలో స్థానికంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.
3/9
ప్రకాశం జిల్లా ఒంగోలులోని QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (QISCET)లో ఈ ముగ్గుల పోటీలు అట్టహాసంగా నిర్వహించారు.
4/9
కాలేజీ విద్యార్థినులు, స్థానిక మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
5/9
రంగురంగుల ముగ్గులతో కళాశాల ప్రాంగణాన్ని మహిళలు, విద్యార్థినిలు కళకళలాడించారు.
6/9
రంగురంగుల ముగ్గులతో కళాశాల ప్రాంగణాన్ని మహిళలు, విద్యార్థినిలు కళకళలాడించారు.
7/9
విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ప్రదానం చేశారు.
8/9
ఈ కార్యక్రమం సంక్రాంతి సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించడంతో పాటు, యువతలో సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంచుతుంది.
9/9
QIS కాలేజీ యాజమాన్యం, ABN ఆంధ్రజ్యోతి బృందం సహకారంతో ఈవెంట్ విజయవంతమైంది. .. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Updated at - Jan 06 , 2026 | 09:56 PM