సేవలో ముందడుగు… మానవత్వంలో ఆదర్శం – TSN యువత
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:17 AM
అమెరికాలో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) యువత మానవత్వాన్ని చాటుకుంది. ఒమాహాలోని Siena Francis Houseలో నిర్వహించిన “Feed the Need” కార్యక్రమంలో 400కు పైగా భోజనాలను స్వయంగా వడ్డించి.. సేవాభావాన్ని చాటారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఒమాహా తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న ఒమాహాలోని Siena Francis Houseలో నిర్వహించిన “Feed the Need – Youth Charity & Food Drive” కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో TSN Youth Team స్వయంగా తమ చేతులతో 400కు పైగా భోజనాలను అవసరంలో ఉన్న వారికి వడ్డించారు. యువతతో పాటు వారి కుటుంబ సభ్యులు, TSN Executive Committee సభ్యులు పాల్గొన్నారు. TSN అధ్యక్షులు కొల్లి గారు, Charity Committee Chair ధనారావు గొట్టిపాటి గారు, Community Committee Chair అవినాష్ గారు, Executive Committee సభ్యుల సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు.

భోజన సేవతో పాటు యువతకు అక్కడి జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిచయం చేసేందుకు ప్రత్యేక facility tour ఏర్పాటు చేశారు. TSN అధ్యక్షులు కొల్లి గారి విజ్ఞప్తి మేరకు Siena Francis House Chair Mrs. Lilly గారు మహిళలు, పురుషుల shelter విభాగాలు, నివాస ప్రాంతాలు, laundry facilities తదితర ప్రదేశాలను యువతకు చూపించారు.
అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన యువత, తమకు తల్లిదండ్రులు, కుటుంబం, నివసించేందుకు ఇల్లు ఉండటం ఎంత అదృష్టమో భావోద్వేగంతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక యువ వాలంటీర్ “నేను పెద్దయ్యాక వీరు అనుభవిస్తున్న బాధను తగ్గించగల పరిష్కారాన్ని కనుగొనాలని ఉంది” అని చెప్పడం మిగతా యువతను కూడా కదిలించింది.

తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు యువతలో సేవాభావం, సానుభూతి, కృతజ్ఞత, సామాజిక బాధ్యత పెంపొందించడం TSN లక్ష్యాల్లో ఒకటని నిర్వాహకులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ప్రతి త్రైమాసికంలో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి మరింత మంది యువతను భాగస్వాములను చేయాలని ఆకాంక్షించారు. సేవను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా, జీవితాంతం కొనసాగించే విలువగా యువత స్వీకరించాలన్నదే “Feed the Need” కార్యక్రమం అందించిన సందేశం.
ఇవీ చదవండి:
బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్ కూల్‌గా.!
పెన్సిల్ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!