మేరీల్యాండ్‌లో విద్యార్థులకు తానా చేయూత.. బ్యాక్‌ప్యాక్‌లు, విద్యా సామగ్రి పంపిణీ
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:00 PM
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా మేరీల్యాండ్‌లో అవసరమైన విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, విద్యా సామగ్రిని అందించే బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా మేరీల్యాండ్‌లో అవసరమైన విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, విద్యా సామగ్రిని అందించే బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్సిళ్లు, పెన్నులు, క్రేయాన్స్, ఎరేజర్లు తదితర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి, తమ మద్దతును అందించిన తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలికి తానా క్యాపిటల్ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది.

మేరీల్యాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తానా ప్రతినిధులు, స్థానిక వాలంటీర్లు పాల్గొని విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లు, అవసరమైన పాఠశాల సామగ్రిని అందించారు. చిన్నారుల చదువుకు అవసరమైన వస్తువులను అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, విద్యార్థుల కుటుంబాలపై పడే పాఠశాల సామగ్రి కొనుగోలు భారాన్ని కొంత తగ్గించడమే లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

తానా అమెరికాలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో విద్య, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. స్కాలర్‌షిప్‌లు, విద్యా సహాయం, బ్యాక్‌ప్యాక్‌ల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా అవసరంలో ఉన్న విద్యార్థులకు అండగా నిలుస్తోంది. తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో స్థానిక వాలంటీర్లు, యువత కూడా భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై తమ వంతు సహాయం, విరాళాలు, ప్రోత్సాహాన్ని అందించిన తానా బోర్డ్ డైరెక్టర్ అనిల్ ఉప్పలపాటి, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో-ఆర్డినేటర్ సాయి బొల్లినేని, తానా బాల్టిమోర్ సిటీ కో-ఆర్డినేటర్ ఉమాకాంత్‌తో పాటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ తానా రీజినల్ రిప్రజెంటేటివ్ సుధీర్ కొమ్మి ధన్యవాదాలు తెలియజేశారు.



