కెనడా నుంచి అత్యధికంగా భారతీయుల డిపోర్టేషన్
ABN , Publish Date - Apr 30 , 2026 | 09:03 PM
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కెనడా నుంచి డిపోర్టేషన్‌కు గురైన వారిలో భారతీయులు టాప్‌లో నిలిచారు. మెక్సికన్లను అధిగమించి సంఖ్యా పరంగా తొలిస్థానంలో నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడా నుంచి డిపోర్టు అయిన వారిలో ఈసారి భారతీయులు సంఖ్యాపరంగా టాప్‌లో నిలిచారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డిపోర్టు అయిన వారిలో భారతీయులు మెక్సికన్‌లను అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో 1,712 మంది భారతీయులు కెనడా నుంచి డిపోర్టేషన్‌కు గురయ్యారు. డిపోర్టు అయిన విదేశీయుల్లో భారతీయుల వాటా 32.5 శాతం. ఈ కాలంలో కేవలం 743 మంది మెక్సికన్‌లే డిపోర్ట్ అయ్యారు.
బలవంతపు వసూళ్లు, వేధింపుల ఘటనల్లో పాత్ర ఉన్న కారణంగా ఎక్కువ మంది భారతీయులు ఈ త్రైమాసికంలో డిపోర్టు అయినట్టు కెనడా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇక 2020 తరువాత భారతీయుల డిపోర్టేషన్లు గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 2020లో మొత్తం 12,858 మంది విదేశీయులు కెనడా నుంచి డిపోర్టేషన్‌కు గురికాగా వారిలో భారతీయుల సంఖ్య 1,424. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఇలా డిపోర్టేషన్‌కు గురయ్యే వారు కొన్ని సందర్భాల్లో మళ్లీ కెనడా వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
డల్లాస్‌లో ATA ఫండ్‌రైజర్ కార్యక్రమం ఘన విజయం
పెరిగిన విమాన టికెట్ల ధరలు! అత్యధిక ధర చెల్లిస్తున్న రాయలసీమ వాసులు
For More NRI News And Telugu News