Share News

దుబాయిలో భారత కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్‌ రెడ్డి

ABN , Publish Date - Aug 04 , 2026 | 07:13 AM

దుబాయిలో భారత కాన్సుల్‌ జనరల్‌గాతెలుగు వ్యక్తి డాక్టర్‌ ఇమ్మడి విష్ణువర్ధన్‌ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాన్సుల్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి రావడంతో దుబా యి, ఇతర ఎమిరేట్‌లలోని తెలుగు ప్రవాసీలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

దుబాయిలో భారత కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్‌ రెడ్డి
Vishnuvardhan Reddy

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): దుబాయిలో భారత కాన్సుల్‌ జనరల్‌గాతెలుగు వ్యక్తి డాక్టర్‌ ఇమ్మడి విష్ణువర్ధన్‌ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాన్సుల్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి రావడంతో దుబా యి, ఇతర ఎమిరేట్‌లలోని తెలుగు ప్రవాసీలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు రసమయి అధ్యక్షుడు యస్వి రెడ్డి ఆధ్వర్యంలో కొందరు తెలుగు ప్రముఖులు విష్ణువర్ధన్‌ రెడ్డిని కలిశారు. దుబాయి, ఉత్తర ఎమిరేట్‌లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సగటు కార్మికుల జీవన స్థితిగతులను వారు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు.


ఇవి కూడా చదవండి

ఫెర్టిలైజర్‌ యాప్‌ను తేనున్న కేంద్రం.. ఒకే యాప్‌ ద్వారా అన్ని ఎరువులు..

ఔట్‌ సోర్సింగ్‌ పోస్టు @ రూ.3 లక్షలు!

Updated Date - Aug 04 , 2026 | 07:16 AM