Share News

అమెరికాలో దేశీ డాన్స్ వర్కవుట్ విజయవంతం

ABN , Publish Date - Sep 14 , 2026 | 09:37 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘దేశీ డాన్స్ వర్కవుట్’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అమెరికాలో దేశీ డాన్స్ వర్కవుట్ విజయవంతం

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘దేశీ డాన్స్ వర్కవుట్’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు. నార్త్ కరోలినాలోని ఓ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 250 మందికి పైగా మహిళలు హాజరయ్యారు.


NRI.jpg

ప్రముఖ జుంబా ఇన్‌స్ట్రక్టర్ మౌనిక కావలి మహిళలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సౌమ్యశ్రీ తలంకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హాజరైన మహిళలందరికీ ‘అమోఘం ఇండియన్ రెస్టారెంట్’ వారి సౌజన్యంతో ఉచిత అల్పాహారం అందించారు.


NRI-1.jpg

తానా హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరినీ తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఈవిపి శ్రీనివాస్ రావు అభినందించారు. తానా రిప్రజెంటేటివ్ రవి (నాని) వడ్లమూడి, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి, టీమ్ స్క్వేర్ చైర్ పర్సన్ కిరణ్ కొత్తపల్లి, ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేనితో పాటు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేశారు.

NRI-4.jpgNRI-2.jpgNRI-3.jpg

Updated Date - Sep 14 , 2026 | 09:37 PM