అమెరికాలో తెలంగాణ సంస్కృతి వైభవం.. బతుకమ్మ పాటలు, ఆటలతో హోరెత్తిన నార్త్ కరోలినా!
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:42 AM
కాంకార్డ్: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం కాంకార్డ్లోని కానన్ రన్ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రవాస తెలంగాణ మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానికంగా లభించిన తీరొక్క రంగుల పూలతో..
కాంకార్డ్: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం కాంకార్డ్లోని కానన్ రన్ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రవాస తెలంగాణ మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానికంగా లభించిన తీరొక్క రంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. సంబరాల ముగింపులో బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.
మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోగా.. బతుకమ్మ పాటలు, ఆటలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో సందడి మరింత పెరిగింది. పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల కోలాహలం, సంప్రదాయ పాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ తమ మాతృభూమి సంస్కృతిని మరిచిపోకుండా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం విశేషం. ఈ వేడుకల ద్వారా తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతోపాటు, ప్రవాస తెలంగాణీయుల మధ్య ఐక్యతను చాటిచెప్పారు. మహిళలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో కాంకార్డ్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి.