Home » Pravasa
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో జరిగిన ‘మీట్ విత్ మన్నవ మోహన కృష్ణ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రవాస ఆంధ్రులు, వ్యాపార వేత్తలు, అమెరికా టీడీపీ నాయకులు,
ఖతర్‌లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘానికి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ అనూహ్యంగా అఖండ విజయం సాధించారు. అంతేకాకుండా తమ గెలుపు నల్లేరుమీద నడకే అన్న విశ్వాసంతో ఉన్న ప్రత్యర్ధి శిబిరం నుండి పోటీ చేసిన వారిలో..
తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌న, రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లను గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్, తెలుగు సంఘాల ఐఖ్య వేదిక అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు కలిశారు. తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే నెలనెల తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా 79వ ఇంటర్నేషనల్ జూమ్ మీటింగ్ ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం
NRI, TANTEX : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదికగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 210వ సాహిత్య సదస్సు జనవరి 19వ తేదీన డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ''సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా'' అంశంపై వక్తలు మాట్లాడారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్‌లో భారీ స్కాం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు.. భారీగా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించినట్లు తానాలోని పెద్దలు గుర్తించారు.
హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నాంటాయి. ఓకే చోటకు మహిళలంతా చేరి బతుకమ్మ ఆడారు. తర్వాత అందరూ కలిసి విందు భోజనం ఆరగించారు. ప్రతీ ఏటా బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు.
2025 తానా (TANA) మహాసభల సమన్వయకర్త నియామక ప్రక్రియ చెల్లదని ప్రస్తుత తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, తానా కార్యదర్శి కసుకుర్తి రాజాలకు నోటీసులు పంపించారు.
ఎడారి దేశంలో కన్న తండ్రి కన్నుమూస్తే కడసారి చూడడానికి ఆ దేశంలో ఉన్న కొడుకు చూడలేని పరిస్థితి. భుజాల మీద మోసి, పెద్ద చేసిన తండ్రికి కడసారి వీడ్కోలు పలుకలేపోయాడు. ఎలాగోలా ధైర్యం చేసి వచ్చేసిన ఆ కుమారుడికి నిరాశే మిగిలింది. 900 కిలో మీటర్ల దూరం వచ్చేసరికి కన్న తండ్రి మృతదేహం మాతృదేశానికి వెళ్ళిందని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు.