Share News

AAA ఆధ్వర్యంలో.. అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ ఏర్పాటు

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:40 AM

అమెరికాలోని ఆంధ్రప్రదేశ్‌ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు Andhra Pradesh American Association (AAA), Andhra Pradesh Business Community (ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.

AAA ఆధ్వర్యంలో.. అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ ఏర్పాటు

అమెరికాలోని ఆంధ్రప్రదేశ్‌ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు Andhra Pradesh American Association (AAA), Andhra Pradesh Business Community (ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి. ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి, కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్‌కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.


ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లు

లాస్‌వేగాస్‌‌లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్‌, వ్యాపారవేత్త, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్టర్‌గా బొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) వ్యవహరిస్తున్నారు. మెంటరింగ్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.


ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్‌గా హనుమంతు సింహబలుడు (సింహ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.

nri1.jpg


టెక్నాలజీ, కన్సల్టింగ్‌, స్టార్టప్స్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో వ్యాపారవేత్తగా దొమ్మరాజు హేమంత్ వర్మ వ్యవహరిస్తున్నారు. అలాగే ERP & Automations డైరెక్టర్‌గా, వ్యూహాత్మక కన్సల్టింగ్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు.. పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.


18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన గొట్టిపాటి కళ్యాణ్.. ఎంటర్‌ప్రెన్యూర్‌, ఐటీ ప్రొఫెషనల్‌. ఆపరేషన్స్‌, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.


nri.jpg

ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన చౌటకూరి చేతన్ రెడ్డి.. టెక్నాలజీ ప్రొఫెషనల్‌. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.


నాయకత్వం, నెట్‌వర్కింగ్‌కు ప్రాధాన్యం

AAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్‌, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్‌, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌, బలమైన నెట్‌వర్క్‌ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.


స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్‌వర్క్‌ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్‌ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

Updated Date - Aug 14 , 2026 | 06:57 AM