Share News

Glowing Skin In Winter Tips: చర్మం మెరిసేందుకు

ABN , Publish Date - Jan 19 , 2026 | 01:17 AM

Winter Skin Care Tips Simple Home Remedies for Soft Glowing Skin

Glowing Skin In Winter Tips: చర్మం మెరిసేందుకు

శీతాకాలంలో చర్మం పగిలి గరుకుగా మారుతుంటుంది. అలాంటప్పుడు చర్మం మృదువుగా మెరిసేందుకు పాటించాల్సిన చిట్కాలు...

  • చలిగా ఉందంటూ వేడివేడి నీళ్లతో స్నానం చేయకూడదు. అలా చేస్తే చర్మం తేమను కోల్పోతుంది. గోరువెచ్చటి నీటిని మాత్రమే స్నానానికి వినియోగించాలి. దాహం అనిపించకపోయినా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి.

  • రాత్రి పూట బాదం, వాల్‌నట్స్‌ను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. వాటిలో ఉండే ఇ విటమిన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి పోషణను అందిస్తాయి.

  • రాత్రి పడుకునేముందు పాలలో దూది ఉండను ముంచి దానితో ముఖాన్ని సున్నితంగా రుద్దాలి. పాలలో ఉండే లాక్టోస్‌ చర్మానికి మంచి ఛాయను, మెరుపును అందిస్తుంది. చలి గాలి వల్ల పగిలిన చర్మం మృదువుగా మారుతుంది.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు, ఒక చెంచా గ్రీన్‌ టీ పొడి వేసి బాగా మరిగించాలి. తరువాత మరో గిన్నెలోకి వడబోయాలి. ఇది చల్లారిన తరువాత అందులో నాలుగు చెంచాల రోజ్‌ వాటర్‌ వేసి కలపాలి. రాత్రి పడుకునేముందు ఈ నీటిని ముఖం మీద చిలకరించుకుని వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. ఉదయాన్నే చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా ప్రకాశవంతంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, ఎండ, దుమ్ము వల్ల ఏర్పడిన నలుపుదనం తొలగిపోతుంది.

  • చిన్న గిన్నెలో నాలుగు చెంచాల బాదం నూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. దీన్ని వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముఖానికి మర్దన చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడి చర్మం తేమతో నిండుతుంది. ముఖం మృదువుగా ప్రకాశిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

For More TG News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 01:17 AM