Share News

గోడకు ప్రాణం పోద్దాం!

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:45 AM

నగరాల్లో ఇళ్లు చిన్నవైపోతున్నాయి. అయినప్పటికీ మొక్కలు పెంచాలనే కోరిక మాత్రం తగ్గడం లేదు. స్థలం లేదని బాధపడేవారికి ‘వర్టికల్‌ గార్డెనింగ్‌’ అద్భుతమైన వరం....

గోడకు ప్రాణం పోద్దాం!

నగరాల్లో ఇళ్లు చిన్నవైపోతున్నాయి. అయినప్పటికీ మొక్కలు పెంచాలనే కోరిక మాత్రం తగ్గడం లేదు. స్థలం లేదని బాధపడేవారికి ‘వర్టికల్‌ గార్డెనింగ్‌’ అద్భుతమైన వరం. మీ ఇంటి గోడలనే పచ్చని తోటలుగా మార్చే ఈ ట్రెండ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

ఫ్లోర్‌ స్పేస్‌ సేవింగ్‌: నేల ఖాళీగా ఉండటం వల్ల గది పెద్దదిగా కనిపిస్తుంది.

విజువల్‌ మ్యాజిక్‌: గోడపైదాకా పాకే మొక్కలు గది ఎత్తును పెంచినట్టు చూపిస్తాయి.

లైవ్‌ వాల్‌పేపర్‌: ప్లాస్టిక్‌ వాల్‌పేపర్ల కంటే ప్రాణం ఉన్న మొక్కలు ఇంటికి రిచ్‌ లుక్‌ను ఇస్తాయి.

ఏ మొక్కలు బెస్ట్‌?

తక్కువ మట్టి, తక్కువ ఎండలో పెరిగే మొక్కలే దీనికి ప్రాణం.

మనీప్లాంట్‌: వేగంగా పాకుతూ గదికి పచ్చదనాన్ని ఇస్తుంది.

స్నేక్‌ప్లాంట్‌: నిలువుగా పెరుగుతూ రాత్రిపూట కూడా ఆక్సిజన్‌

అందిస్తుంది.

స్లైడర్‌ ప్లాంట్‌: అందమైన ఆకులతో గాలిని శుద్ధి చేస్తుంది.

లాభాలు అనేకం

నేచురల్‌ ఏసీ: గోడకు మొక్కలు ఉండటం వల్ల బయటి వేడి లోపలికి రాదు, ఇల్లు చల్లగా ఉంటుంది.

స్ర్టెస్‌ బస్టర్‌: పచ్చని గోడవైపు చూడటం వల్ల కంటికి, మనసుకు రిలాక్సేషన్‌ లభిస్తుంది.

తక్కువ ఖర్చు: పాత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ లేదా చెక్క ఫ్రేములను వాడి తక్కువ ఖర్చుతో మనమే దీనిని డిజైన్‌ చేసుకోవచ్చు.

నీరు: గోడ తడవకుండా డ్రిప్‌ సిస్టమ్‌ లేదా స్ర్పేబాటిల్‌ వాడండి.

వెలుతురు: కిటికీ దగ్గరగా ఉండే గోడను ఎంచుకుంటే మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

శుభ్రత: వారానికోసారి ఆకులపై దుమ్ము తుడిస్తే మెరుపు తగ్గదు

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 01:45 AM