Share News

దైవనిష్టలో పది రోజులు

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:02 AM

పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస వ్రతం, తరావీహ్‌ నమాజ్‌, ఫిత్రా దానం తరువాత ఎతేకా్‌ఫకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘ఎతేకాఫ్‌’ అంటే ‘తనను తాను నియంత్రించుకోవడం’ లేదా ఏదైనా ‘విషయంమీద స్థిరంగా ఉండడం...

దైవనిష్టలో పది రోజులు

సందేశం

పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస వ్రతం, తరావీహ్‌ నమాజ్‌, ఫిత్రా దానం తరువాత ఎతేకా్‌ఫకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘ఎతేకాఫ్‌’ అంటే ‘తనను తాను నియంత్రించుకోవడం’ లేదా ఏదైనా ‘విషయంమీద స్థిరంగా ఉండడం’ అనేవి సాధారణ అర్థాలు. షరీయత్‌ పరిభాషలో ఒక మనిషి ప్రత్యేకమైన రీతిలో, ఒక నిర్ణీత కాలంలో మసీదులో ఉండిపోవడం. ఈ ప్రకారం... రంజాన్‌ చివరి పదిరోజుల్లో ప్రపంచ వ్యవహారాలన్నిటినీ పక్కన పెట్టి, కేవలం దైవారాధన, దైవ సంస్మరణ సంకల్పంతో మసీదులో ఉండిపోవడాన్ని ‘ఏతేకా్‌ఫ’గా వ్యవహరిస్తారు. ‘లైలతుల్‌ ఖద్ర్‌’ అనేది పవిత్రమైన, శక్తిమంతమైన రాత్రి. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎతేకాఫ్‌ మంచి సాధనం. ఎతేకాఫ్‌ ఒక సామూహిక విధి. అంటే ఒక మసీదు పరిధిలో ఏ ఒక్కరు ఎతేకాఫ్‌ పాటించినా... అందరి బాధ్యత నెరవేరుతుంది. రంజాన్‌ నెలలోని చివరి పదిరోజులు మసీదులో ఎతేకాఫ్‌ పాటించడం దైవ ప్రవక్త మహమ్మద్‌ సంప్రదాయం. ఆయన ఆ పది రోజులూ రాత్రి సమయాల్లో వీలైనంత ఎక్కువగా జాగరణ చేసి, దైవారాధనలో గడిపేవారు

పాటించాల్సిన నియమాలు: రంజాన్‌ మాసంలో ఇరవయ్యో రోజున... అసర్‌ ప్రార్థన తరువాత లేదా మగ్రిబ్‌ ప్రార్థనకు ముందు ఎతేకా్‌ఫలో కూర్చోవాలి. షవ్వాల్‌ మాసపు నెలవంక కనిపించిందనే ప్రకటన విన్న తరువాత ముగించాలి. ప్రాపంచికమైన వ్యవహారాలన్నిటినీ వదిలిపెట్టాలి. కోరికలకు దూరంగా ఉండాలి. మసీదులో ఒక మూల పరదా కట్టుకొని, సంకల్పించుకున్నన్ని రోజులు అందులో ఉండాలి. నమాజు సమయాల్లో ఎత్తివేయడానికి వీలుగా పరదా కట్టుకోవాలి. ఏకాంతంగా కూర్చొని... అల్లా్‌హను స్మరిస్తూ ఉండాలి. అప్పుడు అల్లా్‌హతో విశ్వాసి సంబంధం పటిష్టం అవుతుంది. హృదయంలో అల్లాహ్‌ పట్ల ప్రేమ, భక్తి, మనసులో ప్రశాంతత, ఒక విధమైన తేజస్సు, దైవానికి సమీపంగా ఉన్నాననే భావన కలుగుతాయి. ఎతేకా్‌ఫలో మూడు రకాలు ఉన్నాయి. అవి:

ముస్తహబ్‌: అంటే అభిలషణీయమైనది. మసీదులో కుడికాలు పెట్టి... ‘బిస్మిల్లాహీ దఖల్‌త్సువనవైతు సున్నతుల్‌ ఎతేకాఫ్‌’ అనే నిర్ణీత ప్రార్థన చేస్తూ ప్రవేశించినట్టయితే... తిరిగి బయటకు వచ్చేంతవరకూ ఎతేకా్‌ఫలో ఉన్నట్టే.

సున్నత్‌: ఇది రంజాన్‌ మాసంలోనే చివరి పది రోజులు మసీదులో ఉండి పాటించే ఎతేకాఫ్‌.

వాజిబ్‌: ఏ విషయంలోనైనా ‘ఫలానా పని నెరవేరితే నేను ఎతేకాఫ్‌ పాటిస్తాను’ అని అల్లా్‌హకు మొక్కుకున్నట్టయితే... దాన్ని పాటించడాన్ని ‘వాజిబ్‌’ అంటారు. ఎతేకాఫ్‌ పాటించే ప్రత్యేక స్థలాన్ని ‘మోతకఫ్‌’ అని పిలుస్తారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 03:02 AM