Share News

నా కిడ్నీ ఫెయిలైంది... నేను కాదు

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:59 AM

‘క్యాష్‌కరో’, ‘ఎర్న్‌కరో’ వంటి విజయవంతమైన స్టార్ట్‌పల వెనుక ఉన్న స్వాతి భార్గవ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ కఠిన దశను బయటపెట్టారు. ఓవైపు కంపెనీ కోసం...

నా కిడ్నీ ఫెయిలైంది... నేను కాదు

న్యూస్‌ మేకర్‌

‘క్యాష్‌కరో’, ‘ఎర్న్‌కరో’ వంటి విజయవంతమైన స్టార్ట్‌పల వెనుక ఉన్న స్వాతి భార్గవ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ కఠిన దశను బయటపెట్టారు. ఓవైపు కంపెనీ కోసం వందల కోట్లు సమీకరిస్తూనే, మరోవైపు ప్రాణాలతో పోరాడిన తన అనుభవాలను ఆమె స్వయంగా వివరించారు. ఆమె కథ, ఆమె మాటల్లోనే...

‘‘నేను అంబాలా అనే చిన్న పట్టణానికి చెందినదాన్ని. ఊరు చిన్నదైనా, నా కలలు మాత్రం చాలా పెద్దవి. ఆ కలలే నన్ను ముందుకు నడిపించాయి. స్కాలర్‌షి్‌పతో సింగపూర్‌లో 11, 12 తరగతులు చదివాను. ఆ తర్వాత మరో స్కాలర్‌షిప్‌ సాధించి ప్రతిష్ఠాత్మక లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అడుగుపెట్టాను. చదువు పూర్తయ్యాక లండన్‌లోని గోల్డ్‌మన్‌ శాక్స్‌లో ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకింగ్‌లో ఐదేళ్లు పనిచేశాను. ఇదంతా నా ప్రయాణంలో ఒక భాగం మాత్రమే.

గోల్డ్‌మన్‌ శాక్స్‌ నుంచి వ్యాపారంలోకి..

గోల్డ్‌మన్‌ శాక్స్‌లో మంచి ఉద్యోగంలో ఉన్నా.. నాలో ఏదో అసంతృప్తి ఉండేది. సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. అదే సమయంలో నా భర్త రోహన్‌తో కలిసి యూకేలో ఒక వ్యాపారం ప్రారంభించాను. ఆ అనుభవంతోనే భారతదేశంలో ‘క్యాష్‌కరో’, ‘ఎర్న్‌కరో’ స్టార్ట్‌పలను నిర్మించాం. క్యాష్‌కరో అనేది ఒక క్యాష్‌బ్యాక్‌ ప్లాట్‌ఫామ్‌ కాగా, ఎర్న్‌కరో ద్వారా వినియోగదారులు అఫిలియేట్‌ లింకులను షేర్‌ చేసి డబ్బు సంపాదించవచ్చు. ఈ ప్రయాణం సులభంగా ఏమీ సాగలేదు.

ఆ నాలుగేళ్లు.. ఓ నరకం!

సరిగ్గా నాలుగేళ్ల క్రితం నా జీవితంలో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొన్నాను. ఓవైపు నా కంపెనీ కోసం సిరీ్‌స-సి రౌండ్‌లో భాగంగా రూ. 130 కోట్లు సేకరించే పనిలో ఉన్నాను. మరోవైపు, నా కిడ్నీ కేవలం 3-4 శాతం మాత్రమే పనిచేస్తోంది. నా హిమోగ్లోబిన్‌ స్థాయి ఐదున్నరకు పడిపోయింది. అయినా నేను వెనకడుగు వేయలేదు. రోజూ మామూలుగానే ఆఫీసుకు వెళ్లేదాన్ని, నా పనులు నేను చేసుకునేదాన్ని. నా అనారోగ్యం గురించి ఎవరికీ తెలియకుండా, నా బాధ్యతలు నిర్వర్తించాను. ఆ సమయంలోనే నాకు కిడ్నీ మార్పిడి జరిగింది.


రతన్‌ టాటా ప్రశంసలు

మా వ్యాపార ప్రయాణంలో పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు మా ఐడియాను వివరించి, ఆయన నుంచి పెట్టుబడి పొందడం ఒక మైలురాయి. ఇప్పటివరకు మా క్యాష్‌కరో కోసం దాదాపు రూ. 250 కోట్లు సమీకరించాం. ఈ విజయాల వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, అవమానాలు, సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్యంతో పోరాడుతూనే, కంపెనీ కోసం నిధులు సేకరించడం నాకు ఒక అగ్నిపరీక్షలాంటిది. నా కథ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ వంటి వారిని కూడా కదిలించింది.

విశ్వాసం నేర్పిన పాఠం

దాదాపు రెండు దశాబ్దాల నా ప్రయాణంలో ఎన్నో తప్పులు చేశాను, మరెన్నో పాఠాలు నేర్చుకున్నాను. నా కిడ్నీకి 20 ఏళ్ల క్రితమే సమస్య మొదలైంది. అయినా చదువును గానీ, కెరీర్‌ను గానీ వదిలిపెట్టలేదు. కిడ్నీ మార్పిడి సమయంలో మా అమ్మ నాకు కిడ్నీ దానం చేసి పునర్జన్మనిచ్చింది. ఈ ప్రయాణంలో నా కుటుంబం, నా బృందం, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. కష్టాలు ఎదురైనప్పుడు విశ్వాన్ని నమ్మాలి, అది మన వెంటే ఉంటుందని విశ్వసించాలి. ఈ పాఠాలనే మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా పోరాటం ఎందరికో స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’.

ఈ వార్తలు కూడా చదవండి..

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Read Latest TG Govt And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 01:59 AM