సూపర్ స్లబ్ డ్రస్
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:55 AM
రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకుంటే స్లబ్ డ్రస్ ఎంచుకోవాలి. విభిన్నమైన ఆకృతి కలిగిన నూలు వస్త్రంతో రూపొందే ఈ తరహా డ్రస్సులు...
ఫ్యాషన్
రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకుంటే స్లబ్ డ్రస్ ఎంచుకోవాలి. విభిన్నమైన ఆకృతి కలిగిన నూలు వస్త్రంతో రూపొందే ఈ తరహా డ్రస్సులు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడతాయి. కాబట్టి సూపర్ స్పెషల్‌గా కనిపించాలనుకుంటే స్లబ్ డ్రస్‌లో ముస్తాబైపోవాలి.
పక్కపక్కనే మందంగా, పలుచగా వడికిన నూలు వస్త్రంతో తయారైన దుస్తులనే స్లబ్ డ్రసెస్ అంటారు. నలిగే వీల్లేని ఈ దుస్తులు గాలి చొరబడేలా ఎంతో సౌకర్యంగా ఉంటాయి. కాబట్టే ఫ్రాక్‌ను పోలిన స్లబ్ దుస్తులను రూపొందిస్తూ ఉంటారు.
ఇలాంటి సందర్భాల్లో...
సాయంకాలాల్లో స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం కోసం సాఽధారణంగా సౌకర్యంగా ఉండే దుస్తులనే ఎంచుకుంటూ ఉంటారు. ఆ సందర్భానికి తగినవే ఈ దుస్తులు. అలాగే సముద్ర తీరాలు, చిన్నా చితకా షాపింగ్స్, సెలవు రోజుల్లో ఇంట్లో సేదతీరే సందర్భాల్లో ఈ దుస్తులను ఎంచుకోవచ్చు. మరీ ముఖ్యంగా వేడి వాతావరణానికి ఇవెంతో అనువుగా ఉంటాయి.
మ్యాచింగ్ ఇలా...
శాండిల్స్, షూస్ ఈ స్లబ్ డ్రస్‌లకు చక్కగా సూట్ అవుతాయి. అయితే మరీ ముఖ్యంగా స్లీవ్‌లెస్ స్లబ్ డ్రస్ ధరించినప్పుడు, చేతులకు ఎలాంటి యాక్సెసరీస్ ఉపయోగించకూడదు. షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు పెద్ద డయల్‌తో కూడిన వాచ్, హ్యాండ్ బ్యాగ్ వాడుకోవచ్చు.
బోల్డ్‌గా... భిన్నంగా...
డ్రస్ మీద ఆప్లిక్ వర్క్ చేయించుకుంటే ఇంకాస్త వినూత్నంగా కనిపిస్తారు.
సెక్విన్స్, బీడ్స్‌తో స్లబ్ డ్రస్‌కు కొత్త లుక్ తెప్పించవచ్చు.
ఫ్లవర్ డిజైన్స్‌తో ఆహ్లాదకరమైన లుక్ సమకూరుతుంది.
బోల్డ్ కలర్స్‌తో ట్రెండీగా, లేత రంగుల్లో సింపుల్‌గా కనిపించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Read Latest TG Govt And Telugu News