Neck Whitening Tips: అందమైన మెడ కోసం
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:21 AM
చిన్న గిన్నెలో రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా ఓట్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమంతో మెడ మీద అయిదు నిమిషాలు సున్నితంగా...
చిన్న గిన్నెలో రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా ఓట్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమంతో మెడ మీద అయిదు నిమిషాలు సున్నితంగా రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే మృతకణాలు, మురికి తొలగి మెడ ఛాయగా మారుతుంది.
టమాటా, కీరా, బంగాళదుంపల్లో ఒకదాని నుంచి తీసిన రసాన్ని మెడకు పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెడ మీద పేరుకున్న నలుపుదనం తొలగిపోతుంది.
ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, చిటికెడు పసుపు, మూడు చెంచాల పెరుగు వేసి పేస్టులా చేయాలి. దీన్ని మెడకు పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత వేళ్లతో సున్నితంగా రుద్దుతూ పిండిని తొలగించాలి. ఆపైన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తుంటే క్రమంగా మెడ నలుపు తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News